ఆహాలో 'అర్ధశతాబ్దం' .. ట్రైలర్ రిలీజ్

  • మరో ప్రేమకథగా 'అర్ధ శతాబ్దం'
  • ఆసక్తిని రేకెత్తిస్తున్న ట్రైలర్
  • ఈ నెల 11వ తేదీన విడుదల
కథలో కొత్తదనం .. కథనంలో వైవిధ్యం ఉంటే చాలు .. ఆ సినిమా చూడటానికి యూత్ ఉత్సాహం చూపిస్తోంది. అందువల్లనే యువ దర్శకులు ఆ దిశగా ప్రయోగాలు చేస్తూ వెళుతున్నారు. అలా రవీంద్ర పుల్లే అనే కొత్త దర్శకుడు 'అర్ధ శతాబ్దం' సినిమాను రూపొందించాడు. నవీన్ చంద్ర - కార్తీక్ రత్నం (కేరాఫ్ కంచరపాలెం ఫేమ్)  ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ నెల 11వ తేదీన ఆహాలో విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇది ఓ పల్లెటూరిలోని ప్రేమకథ .. ప్రేమకు కులం ఎప్పుడూ అడ్డుగోడగా నిలుస్తూనే ఉంటుంది. ఈ కథలోను అదే ప్రధానమైన అంశం అని తెలుస్తోంది. ప్రేమికులను విడదీయడానికి రెండు కులాలవారు ..  రెండు వర్గాలుగా విడిపోయి చేసే పోరాటంగా ఈ కథ కనిపిస్తోంది. మధ్యలో నక్సలిజం పాయింటును కూడా టచ్ చేశారు.

 "మన పక్కన ఉండేవాడు మన కులం కాకపోయినా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ మన బిడ్డ పక్కలో ఉండేవాడు మనవాడే అయ్యుండాలి" అనే డైలాగ్ ఈ ట్రైలర్ కి హైలైట్. సాయికుమార్ .. ఆమని ఈ సినిమాలో కీలకమైన పాత్రలను పోషించారు.


More Telugu News