'ఛత్రపతి' రీమేక్ విలేజ్ సెట్ డ్యామేజ్!
- 'ఛత్రపతి' హిందీ రీమేక్ కి సన్నాహాలు
- వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్
- 6 ఎకరాల్లో వేసిన విలేజ్ సెట్
- వర్షాల కారణంగా దెబ్బతిన్న సెట్
బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రంగా 'ఛత్రపతి' హిందీ రీమేక్ రూపొందనుంది. వీవీ వినాయక్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో 6 ఎకరాల్లో ఒక విలేజ్ సెట్ వేశారు. ఆర్ట్ డైరెక్టర్ సునీల్ బాబు నేతృత్వంలో ఈ సెట్ ను వేయించారు. మేజర్ పార్టు షూటింగు ఈ సెట్ లోనే చేయాలనుకున్నారు. అయితే ఈ లోగా కరోనా ప్రభావం పెరగడంతో, సెట్ వర్క్ ను ఆపేశారు. అయితే కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు పడుతూ ఉండటంతో, ఈ విలేజ్ సెట్ డ్యామేజ్ అయిందట. ఈ విషయాన్ని మేకర్స్ స్వయంగా తెలియజేశారు.
'ఛత్రపతి' రీమేక్ సెట్ డ్యామేజ్ కారణంగా నిర్మాతకు పెద్దమొత్తంలోనే నష్టం వచ్చిందని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత సెట్ వర్క్ మళ్లీ మొదటి నుంచి చేసుకురావాలట. కరోనా కారణంగా అవుట్ డోర్ కి వెళ్లలేని పరిస్థితుల్లో సెట్లు వేయించేసి పని కానిచ్చేద్దామని అనుకుంటే, వర్షాల కారణంగా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నాని హీరోగా చేస్తున్న 'శ్యామ్ సింగ రాయ్' కోసం వేసిన సెట్ కూడా ఇటీవల వర్షాల కారణంగా డ్యామేజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక 'ఛత్రపతి' హిందీ రీమేక్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ 'కర్ణన్' రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.