'డియర్ మేఘ' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్!
- ప్రేమకథా చిత్రంగా 'డియర్ మేఘ'
- జోడీగా అదిత్ అరుణ్ - మేఘ ఆకాశ్
- పూర్తయిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు
- ఓటీటీ ద్వారా త్వరలో విడుదల
తెలుగు తెరపైకి రావడానికి మరో సరికొత్త ప్రేమకథా చిత్రం ముస్తాబవుతోంది .. ఆ సినిమా పేరే 'డియర్ మేఘ'. అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. అదిత్ అరుణ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో, ఆయన జోడీగా మేఘ ఆకాశ్ అలరించనుంది. ఈ రోజున అదిత్ అరుణ్ పుట్టినరోజు కావడంతో, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాయకానాయికలతో కూడిన ఈ పోస్టర్, చక్కని ఫీల్ తో ఆకట్టుకుంటోంది.
ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, "అదిత్ అరుణ్ ఇంతకుముందు ప్రేక్షకులకు హీరోగా పరిచయమే. అయితే మా సినిమాలో అతను కొత్తగా కనిపిస్తాడు. ఆయనకు లభించిన మంచి పాత్ర ఇది .. యూత్ ను ఎంతగానో ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది. ఈ సినిమా ఆయన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఓటీటీ ద్వారానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి" అని చెప్పుకొచ్చారు.