భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు అవసరం: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- జాతీయ విద్యావిధానంపై వర్చువల్ సమావేశం
- మాతృభాష, పరభాష రెండింటినీ నేర్చుకోలేకపోతున్నారు
- విద్యార్థులు బట్టీపట్టడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు
భావ వ్యక్తీకరణకు మాతృభాషపై పట్టు ఎంతో అవసరమని సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీ ప్రైవేటు పాఠశాలల సంఘం జాతీయ విద్యావిధానంపై నిన్న నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
జాతీయ విద్యా విధానాన్ని అవకాశంగా మార్చుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. జాతీయ విద్యావిధానం ప్రకారం ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలని అన్నారు. పరభాషలో బోధించడం వల్ల విద్యార్థులు అటు మాతృభాష, ఇటు పరభాష రెండింటినీ నేర్చుకోలేకపోతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సీబీఎస్ఈ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించిందని, కానీ దానిని అమలు చేయాలంటే కొన్ని ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం విద్యార్థులు చదువుతున్న దానికి, చేస్తున్న పనికి సంబంధమే ఉండడం లేదన్న లక్ష్మీనారాయణ.. బట్టీ పట్టేందుకే విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు.
మాతృభాష కన్నా పరాయిభాషపైనే మక్కువ చూపుతుండడంతోనే జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. వృత్తి విద్య కోర్సుల్ని ఆరో తరగతిలోనే ప్రవేశపెట్టాలని నిర్ణయించారన్నారు. ఫలితంగా విద్యార్థులు 12వ తరగతికి చేరుకునే లోగానే కొత్త అంశాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని లక్ష్మీనారాయణ వివరించారు.