వచ్చే నెలలో కొవాగ్జిన్ మూడో దశ పరీక్షల తుది ఫలితాలు!

  • ఇప్పటికే రెండు దశల ప్రయోగ ఫలితాల విశ్లేషణ
  • మూడో దశ తర్వాత పూర్తి స్థాయి అనుమతులకు దరఖాస్తు
  • ఈ దశలో 25,800 మంది వలంటీర్లపై ప్రయోగం
భారత్ బయోటెక్ అభివృద్ధి చేసి ఉత్పత్తి చేస్తున్న కరోనా టీకా కొవాగ్జిన్ టీకాపై జరిగిన మూడో దశ పరీక్షల తుది ఫలితాలు వచ్చే నెలలో రానున్నాయి. ఈ దశలో దేశవ్యాప్తంగా మొత్తం 25,800 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన తొలి రెండు దశల ప్రయోగ ఫలితాలను విశ్లేషించగా కరోనాను టీకా సమర్థంగా ఎదుర్కొంటున్నట్టు తేలింది.

ఇప్పుడు మూడో దశ ప్రయోగ ఫలితాలు కనుక వస్తే కనుక భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) వద్ద పూర్తిస్థాయి అనుమతుల కోసం భారత్ బయోటెక్ సంస్థ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ టీకాకు అత్యవసర అనుమతి మాత్రమే ఉంది. తుది దశ పరీక్ష ఫలితాల విశ్లేషణ అనంతరం కొవాగ్జిన్ టీకాపై పీర్ రివ్యూ (సమీక్ష)కు పంపుతారు. ఈ టీకాపై ఇప్పటి వరకు 9 పరిశోధనా పత్రాలను ప్రచురించారు.


More Telugu News