కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ హత్యల కేసులో ఎన్ఐఏ అదనపు చార్జ్‌షీట్

  • కిడారి, సోమ హత్యల కేసులో కళావతిదే కీలక పాత్ర
  • హత్య చేసిన బృందానికి అన్నీ సమకూర్చింది ఆమెనే
  • అనుబంధ చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ
2018లో అప్పటి అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యలలో మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ సభ్యురాలు సాకే కళావతి అలియాస్ భవానీ (45) కీలక పాత్ర పోషించిందని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ మేరకు విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో నిన్న అనుబంధ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. కాగా, జంట హత్యల కేసులో ఎన్ఐఏ ఇప్పటికే 9 మంది నిందితులపై అభియోగపత్రం దాఖలు చేసింది.

హత్యలు జరగడానికి రెండు వారాల ముందే కళావతి, ఆమె భర్త, మావోయిస్టు పార్టీ జోనల్ కమిటీ సభ్యుడైన కాకూరి పండన్నతోపాటు మరో 40 మంది డుంబ్రిగూడలో మకాం వేశారని ఎన్ఐఏ తన అభియోగపత్రంలో పేర్కొంది. కిడారి, సోమలను హత్యలు చేసే బృందానికి అవసరమైన వనరులు, ఇతర సరంజామాను ఆమె అందించినట్టు పేర్కొంది. కళావతి రెండు దశాబ్దాల క్రితమే మావోయిస్టు పార్టీలో చేరిందని ఎన్ఐఏ తన చార్జ్‌షీట్‌లో వివరించింది.


More Telugu News