మిల్కా సింగ్ అర్ధాంగి నిర్మలా మిల్కా సింగ్ ఇకలేరు
- కరోనాతో చండీగఢ్‌లో కన్నుమూసిన నిర్మల
- గత కొన్ని రోజులుగా ఐసీయూలో చికిత్స
- అయినా ఫలించని ప్రయత్నాలు
- ఆదివారం సాయంత్రం ముగిసిన అంత్యక్రియలు
- వైద్య పర్యవేక్షణలో ఉండి హాజరుకాలేకపోయిన మిల్కా సింగ్
ఇటీవల కొవిడ్ బారిన పడిన లెజెండరీ భారత స్ప్రింటర్ మిల్కా సింగ్ భార్య, భారత వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మలా మిల్కా సింగ్ కన్నుమూశారు. చండీగఢ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం తుదిశ్వాస విడిచినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. గత నెల కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ.. గత వారం రోజులుగా ఆమె పరిస్థితి పూర్తిగా విషమించి నేడు కన్నుమూసిందని వైద్యులు తెలిపారు.
మరోవైపు మిల్కా సింగ్ సైతం కరోనాతో నిర్మల చేరిన ఆసుపత్రిలోనే చికిత్స తీసుకున్నారు. చికిత్సకు బాగా స్పందించిన ఆయన క్రమంగా కోలుకుంటున్నారు. కానీ, ఆయనపై ఇంకా వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం జరిగిన భార్య నిర్మల అంత్యక్రియలకు మాత్రం ఆయన హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 85 ఏళ్ల నిర్మల పంజాబ్‌లో ‘డైరెక్టర్ ఫర్ స్పోర్ట్స్ ఫర్ వుమెన్’గా కూడా వ్యవహరించారు.