జియోన మరణించలేదు, ఇంకా బతికే ఉన్నారు: కుటుంబ సభ్యులు
- ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజమానిగా జియోనకు గుర్తింపు
- ఆదివారం ఆయన చనిపోయినట్టు వైద్యుల ధ్రువీకరణ
- మరణించలేదంటూ అంత్యక్రియల నిర్వహణకు ససేమిరా
39 మంది భార్యలు, 90 మందికిపైగా సంతానం, 33 మంది మనవళ్లు, మనవరాళ్లతో ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి యజమానిగా పేరు గాంచిన జియోన చన (76) ఆదివారం మరణించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ వార్తలు నిజం కాదని, ఆయన బతికే ఉన్నారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మిజోరంలోని బక్తావంగ్ గ్రామానికి చెందిన జియోన అనారోగ్యంతో మరణించినట్టు ఆదివారం వైద్యులు కూడా ధ్రువీకరించారు. దీంతో ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు.. జియోన శరీరం వెచ్చగా మారడంతో అంత్యక్రియలు నిర్వహించలేదు. ఆయన బతికే ఉన్నారని నమ్ముతున్నారు. ఆయన పల్స్ బీట్ కూడా మొదలైందని, కాబట్టి అంత్యక్రియలు నిర్వహించలేమని తేల్చి చెప్పారు.