ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత ఇండియానే: ఆస్ట్రేలియా కెప్టెన్ పైన్

  • ఎల్లుండి టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ టెస్ట్ ఫైనల్
  • ఇంగ్లండ్ లో జరగనున్న ఫైనల్స్ మ్యాచ్
  • ఇండియా జట్టు బలంగా ఉందన్న పైన్
ఒక అద్భుతమైన ఘనతను సాధించేందుకు టీమిండియా ఒక అడుగు దూరంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ను సాధించేందుకు ఉరకలేస్తోంది. ఆస్టేలియాను వారి సొంతగడ్డపై, ఇంగ్లండ్ ను భారత గడ్డపై ఓడించిన తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ కు చేరుకుంది. ఎల్లుండి (18వ తేదీ) టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో న్యూజిలాండ్ జట్టును ఎదుర్కోనుంది. ఈ ఫైనల్స్ మ్యాచ్ కు ఇంగ్లండ్ ఆతిథ్యమిస్తోంది. మరోవైపు ఛాంపియన్ షిప్ ను ఎవరు సాధిస్తారనే విషయంపై ఆస్ట్రేలియా టెస్ట్ జట్టు కెప్టెన్ టిమ్ పైన్ జోస్యం చెప్పాడు.

తన అంచనా ప్రకారం ఛాంపియన్ షిప్ ను గెలుచుకునేది ఇండియానే అని పైన్ అంచనా వేశాడు. కోహ్లీ సేన అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగుతుందని... టీమిండియా గెలుస్తుందని చెప్పడంలో సందేహమే లేదని చెప్పాడు. భారత జట్టులో అత్యుత్తమ ఆటగాళ్లు ఉన్నారని... ఎవరి ఆట వారు ఆడితే చాలని అన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా బలంగానే కనిపిస్తోందని... అయితే విజయావకాశాలు భారత్ కే ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.


More Telugu News