రెట్టింపైన నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు
- జూన్ 15 వరకు రూ.1,85,871 కోట్ల పన్నులు
- కార్పొరేషన్ పన్నుతో కలిపి నికర ప్రత్యక్ష పన్నులు రూ.74,356 కోట్లు
- ఎస్‌టీటీతో కలిపి వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.1,11,043 కోట్లు
- స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.2,16,602 కోట్లు
- సవాళ్లున్నప్పటికీ ముందస్తు పన్ను చెల్లింపుల్లో 146% వృద్ధి
ఈ ఆర్థిక సంవత్సరంలో జూన్ 15 వరకు రూ.1,85,871 కోట్ల నికర ప్రత్యక్ష పన్నులు వసూలైనట్లు కేంద్రం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం వసూలైన రూ.92,762 కోట్లతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం విశేషం. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. కార్పొరేషన్ పన్నుతో కలిపి నికర ప్రత్యక్ష పన్నులు రూ.74,356 కోట్లు, సెక్యూరిటీ ట్రాన్స్‌సాక్షన్ ట్యాక్స్(ఎస్‌టీటీ)తో కలిపి వ్యక్తిగత ఆదాయపు పన్నులు రూ.1,11,043 కోట్లు వసూలయ్యాయి.
2021-22లో ఇప్పటి వరకు స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.2,16,602 కోట్లుగా నమోదయ్యాయి. దీంట్లో కార్పొరేషన్ ట్యాక్స్ రూ.96,923 కోట్లు కాగా ఎస్‌టీటీతో కలుపుకొని వ్యక్తిగత ఆదాయపు పన్ను రూ.1,19,197 కోట్లు. క్రితం సంవత్సరం ఇదే సమయంలో రూ.1,37,825 కోట్లు వసూలయ్యాయి.
ఆర్థిక సంవత్సరం తొలినాళ్లలో అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ.. తొలి త్రైమాసికంలో ముందస్తు పన్ను చెల్లింపులు రూ.28,780 కోట్లు వసూలయ్యాయి. అదే క్రితం సంవత్సరం రూ.11,714 కోట్లుగా నమోదయ్యాయి. దాదాపు 146 శాతం వృద్ధి నమోదైంది.