మీ పేరు మీద మీకు తెలియకుండా ఎన్ని ఫోన్​ నంబర్లున్నాయి?.. తెలుసుకోండిలా!

  • కొత్త వెబ్ సైట్ ను తెచ్చిన టెలికం శాఖ
  • మనకు తెలియని నెంబర్లపై ఫిర్యాదు చేసే వీలు
  • ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లోనే సేవలు
  • త్వరలో దేశమంతటా విస్తరణ
కారణాలు ఏవైనా కావొచ్చు.. మనకు తెలియకుండానే చాలా నంబర్లు తీసేసుకుంటాం. పాత నంబర్ ను మరచిపోతుంటాం. అంతేకాదు.. మన పేరు మీద కొందరు కేటుగాళ్లూ సిమ్ లు తీసుకుంటున్న ఘటనలు కోకొల్లలు. మరి, ఇలాంటి పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడం ఎలా? అందుకే కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ దానికో అవకాశం కల్పిస్తోంది.

మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చింది. మనం ప్రస్తుతం వాడే ఫోన్ నంబర్ ను ఎంటర్ చేసి.. వచ్చిన ఓటీపీతో లాగిన్ అయి ఆ వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాదు.. అవసరం లేదు అనుకున్న ఫోన్ నంబర్ ను అక్కడే తీసేయొచ్చు.

ఒకవేళ మనకు తెలియని ఏదైనా నంబర్ మన పేరు మీద నమోదు అయి ఉందని తెలిస్తే.. ఫిర్యాదు కూడా చేయొచ్చు. దాని ఆధారంగా టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఈ సేవలను కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టెలికం సర్కిళ్లలోనే ప్రారంభించారు. అతి త్వరలోనే దేశమంతటా సేవలను అందించనున్నారు.


More Telugu News