ఫ్రైడ్ రైస్ లో బొద్దింక... రెస్టారెంట్ పై మండిపడిన నటి నివేదా పేతురాజ్

  • నివేదా పేతురాజ్ కు చేదు అనుభవం
  • ఆన్ లైన్ లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన నివేదా
  • ప్యాక్ ఓపెన్ చేసి దిగ్భ్రాంతికి గురైన వైనం
  • చచ్చిన బొద్దింక కనిపించడంతో ఆగ్రహం
  • రెస్టారెంట్ ను ట్యాగ్ చేస్తూ పోస్టు
దక్షిణాది సినీ నటి నివేదా పేతురాజ్ ఓ రెస్టారెంట్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఆర్డర్ చేసిన ఫ్రైడ్ రైస్ లో బొద్దింక ఉండడమే అందుకు కారణం. నివేదా నిన్న సాయంత్రం చెన్నైలోని ఓ ప్రముఖ రెస్టారెంట్ నుంచి ఆన్ లైన్ ద్వారా ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. డెలివరీ బాయ్ తెచ్చిన ఫుడ్ పార్శిల్ తెరవగానే ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. అందులో ఓ చచ్చిన బొద్దింక దర్శనమిచ్చింది. దాంతో నివేదా మండిపడ్డారు. సదరు రెస్టారెంట్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే ఇలాంటి రెస్టారెంట్లకు భారీ జరిమానా వడ్డించాలని డిమాండ్ చేశారు. వాళ్లు సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. ఫ్రైడ్ రైస్ లో వచ్చిన బొద్దింక ఫొటోను కూడా నివేదా సోషల్ మీడియాలో పంచుకున్నారు.


More Telugu News