బోనాలు వస్తున్నాయి... గ్రేటర్ లో చాలావరకు వ్యాక్సిన్ ఇవ్వలేదు: రాజాసింగ్ అసంతృప్తి
- జులై 13 నుంచి బోనాలు
- సమీక్షలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
- ఆలయాలు రద్దీగా మారతాయని వెల్లడి
- ఎక్కువమందికి వ్యాక్సిన్ ఇవ్వాలని డిమాండ్
తెలంగాణలో, ముఖ్యంగా జంటనగరాల్లో బోనాలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు తెలంగాణ సంస్కృతికి నిదర్శనాలు. ఈ ఏడాది జులై 13 నుంచి బోనాల పండుగ షురూ కానుంది. అయితే బోనాల సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
త్వరలోనే బోనాలు వస్తున్నాయని, ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బోనాల వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలామందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనే లేదని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సాధ్యమైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్ అందించేలా చూడాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.