ఏపీలో కొత్తగా 4,147 కరోనా కేసులు, 38 మరణాలు
- గత 24 గంటల్లో 96,121 కరోనా టెస్టులు
- తూర్పు గోదావరి జిల్లాలో 838 కేసులు
- అత్యల్పంగా శ్రీకాకుళంలో 128 కేసులు
- కోలుకున్న వారు 5,773 మంది
- ఇంకా 46,126 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 96,121 కరోనా పరీక్షలు నిర్వహించగా 4,147 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 838 కేసులు నమోదయ్యాయి. పశ్చిమ గోదావరిలో 571, చిత్తూరు జిల్లాలో 569 కేసులు వెల్లడయ్యాయి. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 128 కేసులను గుర్తించారు.
అదే సమయంలో 5,773 మంది కరోనా నుంచి కోలుకోగా, 38 మరణాలు సంభవించాయి. అత్యధికంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 12,566కి పెరిగింది.
ఏపీలో ఇప్పటివరకు 18,75,622 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 18,16,930 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 46,126 మంది చికిత్స పొందుతున్నారు.