నిర్మాతగా మారిన అవిక గోర్!

  • చైతూ సరసన 'థ్యాంక్యూ'
  • కల్యాణ్ దేవ్ జోడీగా మరో మూవీ
  • సాయి రోనక్ తో లవ్ స్టోరీ
  • 'పాప్ కార్న్' టైటిల్ ఖరారు  
తెలుగు తెరపై తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్న అవిక గోర్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. వరుస విజయాలు అందుకున్న తరువాత హఠాత్తుగా గ్యాప్ తీసుకున్న ఈ అమ్మాయి, మళ్లీ తెలుగులో వరుస సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతోంది. నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' సినిమా చేస్తున్న అవిక, కల్యాణ్ దేవ్ జోడీగా శ్రీధర్ సీపాన దర్శకత్వంలో మరో సినిమా చేస్తోంది. ఇక  ఈ రెండు సినిమాలతో పాటు ఆమె మరో ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించింది. ఈ సినిమాకి ఆమె కూడా ఓ నిర్మాత కావడం విశేషం.

ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై సాయిరోనక్ హీరోగా ఒక ప్రేమకథా చిత్రం రూపొందుతోంది. మురళీనాగ శ్రీనివాస్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అవిక స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్ ను స్థాపించిన అవిక, ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా మారింది. ఈ సినిమాకి 'పాప్ కార్న్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఒకరంటే ఒకరికి ఎంతమాత్రం పడని ఒక అబ్బాయి .. ఒక అమ్మాయి చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. ప్రమాదకరమైన ఆ పరిస్థితుల్లో వాళ్లు ఏం చేశారనేదే కథ. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, యూత్ ను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.


More Telugu News