70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారు: హరీశ్ రావు
- పామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు పెట్టుబడి, డ్రిప్ ఫ్రీగా ఇస్తున్నాం
- రైతులు ఎంత పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
- గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా డంప్ యార్డులు
- చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీలు
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులను కొనసాగిస్తోందని మంత్రి హరీశ్ రావు చెప్పారు. ములుగు మండలం క్షీరసాగర్‌లో రూ.1.6 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడారు.
పామ్ ఆయిల్ సాగు చేసే రైతులకు పెట్టుబడి, డ్రిప్ ఫ్రీగా ఇస్తున్నామని, రైతులు ఎంత పండించినా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. పామాయిల్ సాగుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పామాయిల్ సాగుకు ముందుకు వచ్చిన బాల్‌రెడ్డి అనే రైతును హరీశ్‌రావు అభినందించారు.
గత 70 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని సీఎం కేసీఆర్ ఏడేళ్లలో చేసి చూపించారని చెప్పుకొచ్చారు. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా డంప్ యార్డులను నిర్మిస్తున్నామని తెలిపారు. చెత్తను తీసుకు వెళ్లేందుకు ట్రాక్టర్, ట్రాలీలను తీసుకువచ్చినట్లు తెలిపారు. క్షీరసాగర్ గ్రామంలో రూ.6.62 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పారిశుద్ధ్య, డ్రైనేజీ నిర్మాణ పనులు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.