అమెరికాలోని జూలో జంతువులకు కూడా కరోనా వ్యాక్సిన్!

  • అమెరికాలో వేగంగా కొనసాగుతున్న వ్యాక్సినేషన్
  • జంతువులకు కూడా వ్యాక్సిన్ వేస్తున్న వైనం
  • రోగ నిరోధకశక్తి ఆధారంగా టీకాలు వేస్తున్న ఓక్లాండోలేని జూ
అగ్రదేశం అమెరికాలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా జరుగుతోంది. తాజాగా అక్కడ జంతువులకు కూడా కరోనా టీకాలను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ఆ దేశంలోని ఒక్లాండో జూలో ఉన్న జంతువులకు వేశారు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లకు వ్యాక్సిన్ వేసినట్టు అక్కడ వైద్య సేవలు అందించే డాక్టర్ హర్మాన్ తెలిపారు.

జూలో ఉన్న జంతువులకు వాటి రోగ నిరోధకశక్తి ఆధారంగా ఎంపిక చేసి, దాని ప్రకారం టీకాలను ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు. జంతువుల కోసం జోటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా వ్యాక్సిన్ ను రూపొందించిందని చెప్పారు. తొలి విడతలో తమ జూ 100 డోసుల వ్యాక్సిన్ అందుకుందని తెలిపారు. జోటీస్ సంస్థ ఇప్పటి వరకు 70 జూలకు 11 వేల డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేసిందని చెప్పారు. తమ జూలో ఒక్క జంతువు కూడా కరోనా బారిన పడలేదని... అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా వాటికి వ్యాక్సిన్లు ఇస్తున్నామని తెలిపారు.


More Telugu News