తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. వరంగల్ జిల్లాలో శవయాత్రపై పిడుగుపాటు
- చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు
- రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురి మృతి
- రాష్ట్రంలో నిన్న పలుచోట్ల భారీ వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పిడుగుపాటు కారణంగా వేర్వేరు చోట్ల నిన్న ముగ్గురు మృత్యువాతపడ్డారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టలో కొమ్ము సాయమ్మ (50), కొమ్ము అమరేశ్వరి (28), ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం నిపానిలో వేపల ఎల్లమ్మ (30) పిడుగుపడి మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు కూడా గాయపడ్డారు.
వరంగల్ రూరల్ జిల్లా, సంగెం మండలంలో ఓ శవయాత్రపై పిడుగు పడడంతో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం రాత్రి వరకు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అయిజలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.