క్రిస్మస్ దిశగా చూస్తున్న 'పుష్ప'
- మళ్లీ సెట్స్ పైకి వెళ్లిన 'పుష్ప'
- హైదరాబాద్ లోనే షూటింగు
- కరోనా వల్లనే దసరాకి దూరం
- రిలీజ్ డేట్ పై రావలసిన ప్రకటన
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో మూడో సినిమాగా 'పుష్ప' రూపొందుతోంది. గత రెండు సినిమాల్లోనూ అల్లు అర్జున్ ని సుకుమార్ కొత్తగానే చూపించాడు. ఈ సారి మరింత డిఫరెంట్ గా అల్లు అర్జున్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు. తన లుక్ తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేయడంలో బన్నీ సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా కోసం ఆయన ఎంచుకున్న కథా నేపథ్యం కూడా అందరిలో ఆసక్తిని పెంచడానికి కారణమైంది.
ఇక కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఆగిపోయిన షూటింగు, తిరిగి నిన్ననే హైదరాబాద్ లో మొదలైంది. నిజానికి అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా దసరా బరిలో నిలిచేది. కానీ కరోనా వలన షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. అందువలన ఈ సినిమాను 'క్రిస్మస్' కానుకగా డిసెంబర్ 24వ తేదీన విడుదల చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేకర్స్ ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావలసి ఉంది. తన కెరియర్లోనే ఈ సినిమా ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని ఇప్పటికే అల్లు అర్జున్ చెప్పడంతో, ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి. రష్మికతో కలిసి తెరపై ఆయన చేసే సందడి ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి మరి.