ఈ నెల 15న 'వలిమై' ఫస్టులుక్ రిలీజ్!
- ముగింపు దశలో 'వలిమై'
- నిర్మాతగా బోనీ కపూర్
- విలన్ పాత్రలో కార్తికేయ
- దీపావళికి భారీ విడుదల
తమిళనాట అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అక్కడ ఆయనకి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి థియేటర్లలో నుంచి వెళ్లిపోయేవరకూ వాళ్లు ఫాలో అవుతూనే ఉంటారు. కొంతకాలంగా అజిత్ పరాజయమనేది దరిదాపుల్లోకి రాకుండా దూసుకుపోతున్నారు. ఆయన తాజా చిత్రంగా 'వలిమై' రూపొందుతోంది. హెచ్. వినోద్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ఫస్టులుక్ ఒక రేంజ్ లో ఉంటుందని దర్శకుడు చెప్పిన దగ్గర నుంచి అందరిలో ఆసక్తి పెరుగుతూ వచ్చింది.
అయితే నేడు .. రేపు అంటూ అభిమానులు ఈ ఫస్టులుక్ కోసం వెయిట్ చేస్తూ, అసహనానికి లోనయ్యారు. దాంతో ఈ సినిమా మేకర్స్ ఈ నెల 15వ తేదీన ఫస్టులుక్ పోస్టర్ ను .. మోషన్ పోస్టర్ టీజర్ ను వదలాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు. దాదాపు ఈ తేదీ ఖరారైనట్టేనని అంటున్నారు. హుమా ఖురేషి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, టాలీవుడ్ హీరో కార్తికేయ విలన్ గా నటిస్తుండటం విశేషం. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో బోనీకపూర్ ఉన్నాడు. సాధ్యమైనంత వరకు 'దీపావళి' బరిలోనే ఈ సినిమాను నిలపాలనే ఉద్దేశంతో ఉన్నారు.