తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువు పెంపు

  • ఈ నెల 31 వరకు గడువు పొడిగింపు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్
  • అనుమతులు లేకుండా తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాల గడువును తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు పెంచింది. ఈ మేరకు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ నిన్న పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ఇతర అన్ని రకాల గురుకులాల ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు లేకున్నప్పటికీ కొన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు అనధికారిక భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చినట్టు తెలిపారు. ఇలాంటి కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రత్యక్ష తరగతులు నిర్వహించవద్దని హెచ్చరించారు.


More Telugu News