అఫ్ఘానిస్థాన్‌లో తీవ్రతరమవుతోన్న తాలిబన్ ఉగ్రవాదుల ప్రభావం.. దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందిని వెనక్కి రప్పిస్తోన్న భారత్
- అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా దళాల ఉప సంహరణ
- కాందహార్ నుంచి 50 మంది దౌత్యవేత్తలు, ఇతర భారత సిబ్బంది వెనక్కి
- పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత్
అఫ్ఘానిస్థాన్‌లో అమెరికా ఇప్పటికే తమ దళాలను ఉపసంహరించుకుంటోన్న నేపథ్యంలో తాలిబన్లు మళ్లీ రెచ్చిపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక ప్రాంతాలను ఆక్రమించేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి అమెరికా పూర్తి స్థాయిలో మొత్తం బలగాలను వెనక్కి రప్పించనుంది. దీంతో ఆ సమయం నాటికి అఫ్ఘాన్ మొత్తం తాలిబన్ల పరం కానున్నట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో అక్కడి భారత అధికారులు అఫ్ఘాన్ నుంచి వచ్చేస్తున్నారు.
వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు భారత్ చర్యలు తీసుకుంటోంది. కాందహార్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి 50 మంది దౌత్యవేత్తలు, ఇతర సిబ్బందిని తరలించినట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ దేశంలోని పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పాయి.
అక్కడి భారతీయుల భద్రత కోసం కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపాయి. కాగా, అఫ్ఘాన్‌లో ఇప్పటికే తాలిబన్లు అనేక అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ భవనాలనూ స్వాధీనం చేసుకుంటున్నారు. భద్రతా బలగాలూ ఏమీ చేయలేకపోతున్నాయి.