సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సరోగసీ నేపథ్యంలో కృతిసనన్ సినిమా 
  • ప్రభాస్ తో మైత్రీ మూవీ మేకర్స్ ప్రాజక్ట్
  • 'కేజీఎఫ్' స్టార్ తో బోయపాటి సినిమా    
*  గ్లామరస్ హీరోయిన్ కృతి సనన్ తొలిసారిగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది. 'మిమి' పేరుతో రూపొందుతున్న ఈ హిందీ చిత్రకథ సరోగసీ నేపథ్యంలో సాగుతుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను చిత్ర నిర్మాతలు తాజాగా విడుదల చేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతుంది.
*  ప్రభాస్ హీరోగా ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి బాలీవుడ్ దర్శకుడు, 'వార్' ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ త్వరలో వెలువరించనుంది.
*  ప్రస్తుతం బాలకృష్ణతో 'అఖండ' చిత్రాన్ని చేస్తున్న ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను తన తదుపరి చిత్రాన్ని కన్నడ హీరో, 'కేజీఎఫ్' ఫేమ్ యశ్ తో చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కథ కూడా ఓకే అయిందని, 'అఖండ' పూర్తవగానే ఈ ప్రాజక్టు చేబడతారని అంటున్నారు.


More Telugu News