అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను తాకట్టు పెట్టాడు: చంద్ర‌బాబుపై విజ‌య‌సాయిరెడ్డి ఆరోప‌ణ‌

  • తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు కుట్ర‌
  • ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోంది
  • తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి వ‌చ్చాడు
  • అక్రమ సాగునీటి ప్రాజెక్టులను ప్రశ్నించలేకపోయాడు
టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ అంశాన్ని ప్ర‌స్తావిస్తూ ఆయ‌న ట్వీట్లు చేశారు.

'తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు నాడు బాబు పన్నిన ‘ఓటుకు నోటు కుట్ర’ రాష్ట్రాన్ని ఇప్పటికీ పీడిస్తోంది. తట్టాబుట్టా సర్దుకుని పారిపోయి రావడమేకాక, అక్రమ సాగునీటి ప్రాజెక్టులను ప్రశ్నించలేకపోయాడు. అరెస్టు తప్పించుకునేందుకు ఐదు కోట్ల మంది జీవితాలను తాకట్టు పెట్టాడు' అని విజ‌యసాయిరెడ్డి అన్నారు.

'తెలంగాణలో టీడీపీ ఉంటుంది.. కాంగ్రెస్ ఉంటుంది.. కేంద్రంలో బీజేపీ ఉంటుంది. అందులోకి పంపించిన ఎంపీలు పొత్తుల కోసం లాబీయింగ్ చేస్తుంటారు. తమరు చకోర పక్షిలా ఎదురు చూస్తుంటారు. ఏ ఎన్నికలొచ్చినా వామపక్షాల కాళ్లూ పట్టుకుంటారు. ఇదే కదా బాబూ మీ పొలిటికల్ ఫిలాసఫీ' అని విజ‌యసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


More Telugu News