ఖమ్మంలో సెకండ్​ డోస్​ కోసం బారులు తీరిన జనం

  • ఒకేసారి వెయ్యి మందికి వేస్తామన్న అధికారులు
  • టీకా కేంద్రంలో వసతులు కరవు
  • గంటల తరబడి లైన్ లో నిల్చున్న జనం
ఖమ్మం జిల్లాలో కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోసు కోసం ప్రజలు భారీగా తరలివచ్చారు. చాలా చోట్ల సెకండ్ డోసు వేయట్లేదు. అయితే, తాజాగా కొవాగ్జిన్ సెకండ్ డోస్ టీకా వేస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధికారులు ప్రకటించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒకేసారి వెయ్యి మందికి వేస్తామని చెప్పిన అధికారులు.. అక్కడ సరైన వసతులను మాత్రం ఏర్పాటు చేయలేదు.
 
దీంతో ట్రాన్స్ పోర్ట్ ఆఫీసుకు భారీగా తరలివచ్చిన జనంతో కొంత గందరగోళం ఏర్పడింది. సరైన వసతుల్లేక టీకా కోసం వారు గంటల తరబడి లైన్ లో నిలబడ్డారు. అధికారులు కనీసం కరోనా నిబంధనలు పాటించేలా కూడా ఏర్పాట్లు చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీకా కేంద్రం వద్ద సరైన వసతులేవీ లేవని అసహనం వ్యక్తం చేశారు.


More Telugu News