కూల్ డ్రింకును ఇంత వేగంగా ఇంకెవరూ తాగలేరేమో!

  • అమెరికా పౌరుడి గిన్నిస్ రికార్డు
  • 2 లీటర్ల డ్రింకును 18.45 సెకన్లలో తాగిన వైనం
  • ధ్రువీకరించిన గిన్నిస్ బుక్
  • తిండిపోటీల్లోనూ అమెరికా పౌరుడి సత్తా!
అమెరికా పౌరుడు ఎరిక్ బ్యాడ్ లాండ్స్ బూకర్ అనే వ్యక్తి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించాడు. ఇంతకీ ఎరిక్ చేసిన ఘనకార్యం ఏమిటంటే... 2 లీటర్ల కూల్ డ్రింక్ ను ఓ పాత్రలో పోయగా, దాన్ని కేవలం 18.45 సెకన్లలో తాగేశాడు. రెండు లీటర్ల కూల్ డ్రింక్ ను ఇంత వేగంగా ఎవరూ తాగలేదంటూ గిన్నిస్ బుక్ వారు ధ్రువీకరించారు.

మనవాడు తాగడంలోనే కాదు, తినడంలోనూ చాంపియనే. అనేక పోటీల్లో తన తిండిపోతుతనం ప్రదర్శించి ఔరా అనిపించాడు. అంతేకాదు, ఎరిక్ ర్యాపర్, ప్రఖ్యాత యూట్యూబర్ కూడా. అతడు కూల్ డ్రింక్ ను గటగటా తాగిన వీడియో సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటోంది.


More Telugu News