నాగార్జున సినిమాకి పారితోషికం పెంచేసిన ముద్దుగుమ్మ!
- 'ఉప్పెన'తో దూసుకొచ్చిన కృతిశెట్టి
- డిమాండుతో పారితోషికం పెంపు
- 'బంగార్రాజు'కి 75 లక్షల ఫీజు?
ఒక్క హిట్టు పడితే చాలు.. కథానాయికల దశ ఇట్టే తిరిగిపోతుంది. ఆ వెంటనే తమ పారితోషికాన్ని అమాంతం పెంచేస్తారు. నిర్మాతలు కూడా ఎప్పుడూ ఫ్రెష్ నెస్ కి ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి, అలా కొత్తగా దూసుకొచ్చిన హీరోయిన్లకు ఎక్కువగా బేరాలాడకుండా అడిగినంతా ఇచ్చేస్తారు. ఇప్పుడు టాలీవుడ్ తాజా బ్యూటీ కృతిశెట్టి కూడా అలాగే పారితోషికం పెంచేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఆమధ్య వచ్చిన 'ఉప్పెన' సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కథానాయిక కృతిశెట్టి ఆ సినిమా సాధించిన అనూహ్య విజయంతో ఎంతో డిమాండులోకి వెళ్లిపోయింది. పలువురు హీరోలు ఆమెనే బుక్ చేయమంటూ సిఫార్సు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటి వరకు 50 లక్షల వరకు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు 75 లక్షలు ఛార్జ్ చేస్తోందట.
అక్కినేని నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న 'బంగార్రాజు' సినిమాలో చైతూ సరసన కృతిశెట్టిని కథానాయికగా బుక్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాకి గాను ఈ చిన్నది 75 లక్షలు తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే అమ్మడు తన ఫీజుని కోటి రూపాయలకు పెంచేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.