సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో సినిమాకి ఓకే చెప్పిన కృతిశెట్టి 
  • నాలుగు మెగా చిత్రాలతో తమన్
  • సెప్టెంబర్లో 'పెళ్లిసందడి' రీమేక్  
*  'ఉప్పెన' భామ కృతిశెట్టి త్వరలో నితిన్ సరసన కథానాయికగా నటించనుంది. ప్రముఖ ఎడిటర్ ఎస్.ఆర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికగా కృతిశెట్టిని ఖరారు చేసినట్టు తాజా సమాచారం.
*  ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఇప్పుడు ఏకకాలంలో మెగా కుటుంబానికి చెందిన నాలుగు సినిమాలకు సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. చిరంజీవి నటిస్తున్న 'లూసిఫర్' రీమేక్, పవన్ నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్', చరణ్-శంకర్ కాంబో సినిమాకి, వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న 'గని' చిత్రానికి తమన్ మ్యూజిక్ ఇస్తుండడం విశేషం.
*  నాటి 'పెళ్లిసందడి' చిత్రానికి రీమేక్ గా వస్తున్న 'పెళ్లి సంద-డీ' చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రోషన్, శ్రీలీల జంటగా నటిస్తున్నారు.


More Telugu News