తమిళనాడులో 'అఖండ' క్లైమాక్స్!

  • బాలకృష్ణ తాజా చిత్రంగా 'అఖండ'
  • బోయపాటితో మూడో సినిమా
  • త్వరలో రానున్న ఫస్టు సింగిల్
  • దసరాకి విడుదల చేసే ఆలోచన  
బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్లో 'అఖండ' సినిమా రూపొందుతోంది. కేవలం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉండగా, కరోనా తీవ్రత పెరగడంతో కొన్ని రోజుల క్రితం షూటింగును ఆపేశారు. అప్పటి నుంచి అలా ఆగిపోయిన షూటింగు ఇప్పుడు తమిళనాడులో మొదలైంది. తమిళనాడులోని ఒక ఆలయ ప్రాంతంలో పతాక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

బాలకృష్ణ .. ప్రగ్యా జైస్వాల్ తదితరులు ఈ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. బోయపాటి సినిమాల్లో  క్లైమాక్స్ ఒక రేంజ్ లో ఉంటుందనే విషయం తెలిసిందే. ఆ అంచనాలకి ఎంతమాత్రం తగ్గకుండా ఆయన ఈ సినిమా క్లైమాక్స్ ను డిజైన్ చేశాడట. ఆ స్థాయిలోనే చిత్రీకరిస్తున్నాడని అంటున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని చెప్పుకుంటున్నారు.

భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. ఆయన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్టు సింగిల్ ను వదలనున్నారు. ఈ నెలాఖరు నాటికి షూటింగు పార్టును పూర్తిచేసి, దసరా కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.


More Telugu News