హైదరాబాద్ కు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే మన తదుపరి లక్ష్యం: కేటీఆర్

  • రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు
  • తెలంగాణ వర్గాల్లో సంబరం
  • హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
  • అందరికీ అభినందనలు అంటూ ట్వీట్
ములుగు జిల్లా పాలంపేటలోని 800 ఏళ్ల నాటి రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణలోని రామప్ప ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం హర్షణీయమని తెలిపారు. ఈ శుభవార్తను అందరితో పంచుకోవడం ఆనందాన్నిస్తోందని వివరించారు.

తెలంగాణ నుంచి ఇదే తొలి ప్రపంచ వారసత్వ కట్టడం అని వెల్లడించారు. రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇక రాజధాని హైదరాబాదుకు ప్రపంచ వారసత్వ నగర గుర్తింపే తమ తదుపరి లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన అభిప్రాయాలు పంచుకున్నారు.


More Telugu News