పవన్ - రానా సినిమా వచ్చేది ఆ రోజేనట!

  • సంక్రాంతికి గట్టి పోటీ
  • జనవరి 13న మహేశ్ మూవీ
  • జనవరి 14వ తేదీన ప్రభాస్ సినిమా
  • జనవరి 12న పవన్ మూవీ?  
పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా ఒక సినిమా రూపొందుతోంది. మలయాళంలో విభిన్నమైన కథాకథనాలతో ఆకట్టుకున్న 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకి ఇది రీమేక్. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం కూడా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణలో ఉంది.

ఈ సినిమాను 'సంక్రాంతి'కి విడుదల చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సంక్రాంతి రోజుల్లో ఈ సినిమా ఏ రోజున రానుందనేది ఆసక్తికరంగా మారింది. జనవరి 13వ తేదీన మహేశ్ బాబు 'సర్కారువారి పాట'ను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఇక ప్రభాస్ 'రాధే శ్యామ్' విడుదల తేదీగా జనవరి 14వ తేదీని ఖరారు చేశారు. దాంతో పవన్ సినిమా విడుదల తేదీపై ఆసక్తి పెరిగిపోతోంది.

ఈ నేపథ్యంలో పవన్ సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రభాస్ ..  మహేశ్ బాబు సినిమాల కంటే ముందుగానే పవన్ సినిమా థియేటర్లలో దిగిపోనుందన్న మాట. కథ - స్క్రీన్ ప్లే త్రివిక్రమ్ సమకూర్చిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నిత్యామీనన్ .. ఐశ్వర్య రాజేశ్ కథానాయికలుగా కనిపించనున్నారు.  


More Telugu News