పురుషుల కోసం రెడీ అవుతున్న కుటుంబ నియంత్రణ మాత్ర!

  • కండోమ్ తర్వాత ఇప్పటి వరకు పురుషుల కోసం అందుబాటులోకి రాని సాధనాలు
  • అవాంఛిత గర్భాలతో మహిళలపై ఒత్తిడి
  • పరిశోధనలకు బిల్‌గేట్స్ వితరణ
పురుషుల కోసం త్వరలోనే కుటుంబ నియంత్రణ మాత్రలు అందుబాటులోకి రానున్నాయి. నిజానికి కండోమ్ తర్వాత పురుషుల కోసం ఇప్పటి వరకు కుటుంబ నియంత్రణ సాధనాలేవీ అందుబాటులోకి రాలేదు. ఫలితంగా అవాంఛిత గర్భాలు సంభవిస్తున్నాయి. దాంతో మహిళలపై ఎక్కువ భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ఈ అసమానత్వాన్ని సరిచేయాలని నిర్ణయించుకున్నట్టు స్కాట్లాండ్‌లోని దుండీ యూనివర్సిటీ శాస్త్రవేత్త క్రిస్ బారాట్ తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో పురుషుల కోసం ప్రత్యేకంగా మాత్రలను తీసుకొస్తామన్నారు. ఈ పరిశోధనల్లో బిల్‌గేట్స్ అందించే నిధులు ఎంతగానో తోడ్పడనున్నాయి. వచ్చే రెండేళ్లలో 17 లక్షల డాలర్లను ఆయన ఈ కార్యక్రమానికి అందించనున్నారు.


More Telugu News