'పాగల్' నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్!

  • ప్రేమకథా చిత్రంగా 'పాగల్'
  • ఎమోషన్ కి పెద్ద పీట
  • ఆకట్టుకుంటున్న రధన్ సంగీతం
  • ఈ నెల 14వ తేదీన విడుదల  
విష్వక్సేన్ హీరోగా 'పాగల్' సినిమా రూపొందింది. బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ సినిమాకి, నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించాడు. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి, సిద్ శ్రీరామ్ ఆలపించిన ఒక లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

'ఆగవే నువ్వాగవే .. పోయే ఊపిరే నువ్వాపవే' అంటూ ఈ పాట సాగుతోంది. రధన్ సంగీతం .. కృష్ణకాంత్ సాహిత్యం .. సిద్ శ్రీరామ్ ఆలాపన ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఒకరికి ఒకరు దూరమైనప్పుడు .. ప్రియురాలి తలపులతో ..  బరువెక్కిన మనసుతో ప్రియుడు అనుభవించే వేదనే ఈ పాట.

సినిమాలో సందర్భం తెలిస్తే మరికాస్త మనసుకి దగ్గరయ్యే పాటనే. విష్వక్ సేన్ సరసన నాయికలుగా నివేదా పేతురేజ్ .. సిమ్రన్ .. మేఘలేఖ నటించారు. ఈ సినిమా అమ్మాయిలకు ఎక్కువగా కనెక్ట్ అవుతుందని విష్వక్ చెప్పడం .. ప్రతి అమ్మాయి కంటతడి పెడుతుందని నివేదా చెప్పడం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. తొలి ప్రయత్నంలోనే నరేశ్ కుప్పిలి హిట్ కొడతాడేమో చూడాలి మరి.



More Telugu News