జియోకు డీల్ ఇచ్చేసిన ఎయిర్ టెల్.. ఏపీ సహా మూడు సర్కిళ్లలో ఇక జియో స్పెక్ట్రమ్
- రూ.1004.8 కోట్లతో ఒప్పందం
- జియోకు ‘వినియోగ హక్కుల’ బదిలీ
- మరో రూ.469.3 కోట్లు వస్తాయన్న ఎయిర్ టెల్
రిలయన్స్ జియోకు ఎయిర్ టెల్ డీల్ ఇచ్చేసింది. ఆ సంస్థతో స్పెక్ట్రమ్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలోని తన 800 మెగాహెర్ట్జ్ ల ఎయిర్ వేవ్స్ ను బదిలీ చేసేందుకు రూ.1,004.8 కోట్లతో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తో ఒప్పందం చేసుకుంది.
ఆ డీల్ కు సంబంధించి ఇవాళ రెగ్యులేటరీ ఫైలింగ్ ను ఎయిర్ టెల్ సమర్పించింది. ఆ మూడు సర్కిళ్లలో ఎయిర్ టెల్ స్పెక్ట్రమ్ ను జియో చేతికిచ్చేలా ‘వినియోగ హక్కులను’ బదిలీ చేసినట్టు వివరించింది. ఇప్పటికే జియోతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ మొత్తం తమకు బదిలీ అయిందని చెప్పింది. భవిష్యత్ లో మరో రూ.469.3 కోట్లను జియో చెల్లిస్తుందని వివరించింది.