‘నవరత్నాలు’పై షార్ట్‌ఫిల్మ్‌ పోటీలు.. దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల

  • నవంబర్ 30లోగా దరఖాస్తు చేసుకోవాలి
  • డిసెంబర్ 31లోగా షార్ట్ ఫిలింను పంపించాలి
  • షార్ట్ ఫిలిం మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉండాలి
ఏపీ ప్రభుత్వం నవరత్నాలు పేరుతో సంక్షేమ కార్యక్రమాలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకాలకు ప్రజల నుంచి కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. మరోవైపు నవరత్నాలు, మహిళాభివృద్ధి, సంక్షేమ పథకాలపై షార్ట్ ఫిలిం పోటీలను ప్రభుత్వం నిర్వహించనుంది. షార్ట్ ఫిలిం పోటీలకు ఏపీ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ మేరకు సంస్థ ఎండీ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ పోటీలో పాల్గొనేవారు నవంబర్ 30వ తేదీలోగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీతో పాటు షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ను డీవీడీ లేదా పెన్ డ్రైవ్ లేదా బ్లూరే ఫార్మాట్ లో డిసెంబర్ 31లోగా సంస్థ కార్యాలయానికి పంపాలి. మహిళా నిర్మాతలు, మహిళా సంస్థల ఆధ్వర్యంలో షార్ట్ ఫిలింలను తెలుగులో రూపొందించాలి. మూడు నుంచి నాలుగు నిమిషాల నిడివి ఉండాలి. మరిన్ని వివరాలకు www.apsftvtdc.in ను సంప్రదించవచ్చు.


More Telugu News