కాంగ్రెస్ పాలనలో ప్రయాణికులు ముఖం తుడుచుకుంటే కర్చీఫ్ నల్లగా మారిపోయేది: ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్
- పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై వివాదాస్పద వ్యాఖ్యలు
- ఇదంతా కాంగ్రెస్ నేతల దుష్ప్రచారం
- ఈ పరిణామాలను పెట్రోల్ ధరల పెరుగుదల అని అనకూడదు
- గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా రవాణా కోసం పాత వాహనాలు
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకీ పెరిగిపోతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భోపాల్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
అంతేగానీ, ఈ పరిణామాలను పెట్రోల్ ధరల పెరుగుదల అని అనకూడదని వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా రవాణా కోసం పాత వాహనాలు వినియోగించారని, దీంతో వాయు కాలుష్యం జరిగేదని చెప్పారు. అప్పట్లో డీజిల్ వాహనాల్లో కూర్చున్న ప్రయాణికులు ముఖం తుడుచుకుంటే కర్చీఫ్ నల్లగా మారిపోయేదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అప్పటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ విషయాలను పట్టించుకునేవారు కాదని ఆమె చెప్పుకొచ్చారు.