ఫ్లాట్ గా ముగిసిన మార్కెట్లు

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 14 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 10 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత సెన్సెక్స్ ఒకానొక సమయంలో 239 పాయింట్ల వరకు లాభపడింది. లాభాల స్వీకరణ వల్ల చివరకు మార్కెట్లు డౌన్ ట్రెండ్ లోకి మళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 14 పాయింట్లు నష్టపోయి 55,944కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 16,635కి పెరిగింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టీసీఎస్ (1.42%), ఇన్ఫోసిస్ (0.96%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (0.89%), ఐటీసీ (0.34%), హిందుస్థాన్ యూనిలీవర్ (0.26%).

టాప్ లూజర్స్:
బజాజ్ ఫిన్ సర్వ్ (-2.92%), టైటాన్ కంపెనీ (-2.08%), మారుతి సుజుకి (-1.36%), భారతి ఎయిర్ టెల్ (-1.19%), టాటా స్టీల్ (-1.01%).


More Telugu News