24 గంటలు గడిచినా నా సవాల్ కు ఎవరూ స్పందించలేదు: రేవంత్ రెడ్డి

  • నిన్న మూడుచింతలపల్లిలో రేవంత్ దీక్ష
  • సీఎం దత్తత గ్రామాల్లో అభివృద్ధిపై రేవంత్ సవాల్
  • తన సవాల్ పై ట్వీట్ చేసిన వైనం
  • దీక్ష విజయవంతం అయిందని వెల్లడి
సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో నిన్న తాను చేసిన సవాల్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని తాను సవాల్ చేశానని, అయితే 24 గంటలు గడిచినా అధికార పక్షం నుంచి గానీ, అధికార యంత్రాంగం నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఈ మేరకు నేడు ట్వీట్ చేశారు. తాము చేపట్టిన రెండ్రోజుల దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష విజయవంతం అయిందని వెల్లడించారు.

నిన్న రేవంత్ మూడుచింతలపల్లిలో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ దత్తత తీసుకున్న మూడుచింతలపల్లి, కేశవాపూర్, లక్ష్మాపూర్ గ్రామాల్లో అభివృద్ధి జరగలేదని విమర్శలు చేశారు. దత్తత తీసుకున్న గ్రామాలకు కేసీఆర్ ఏం చేశారో చెబితే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని రేవంత్ సవాల్ చేశారు.


More Telugu News