సాయం కోరిన అమెరికా.. ముందుకొచ్చిన పాకిస్థాన్!

  • నాటో దళాలకు మద్దతుగా పని చేసిన ఆఫ్ఘన్లకు సాయం చేయాలన్న అమెరికా
  • 4 వేల మందికి ఆశ్రయం కల్పించేందుకు పాక్ సన్నాహకాలు
  • 5.5 లక్షల మంది ఆఫ్ఘన్లు దేశాన్ని వదిలి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపిన ఐక్యరాజ్యసమితి
తాలిబన్లు అధికారంలోకి రావడంతో ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్ రక్తమోడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఆ దేశంలో ఉన్న తమ పౌరులను అక్కడి నుంచి తీసుకెళ్లడంలో అన్ని దేశాలు తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే కొన్ని దేశాలు తమ పౌరుల తరలింపు పూర్తయిందని ప్రకటించాయి.

మరోవైపు తమ పౌరులతో పాటు ఆప్ఘన్ జాతీయులను కూడా వివిధ దేశాలు అక్కడి నుంచి తరలించాయి. స్వదేశాన్ని వీడి ఏదో ఒక దేశంలో తలదాచుకునేందుకు కాబూల్ ఎయిర్ పోర్ట్ వద్ద వేలాది మంది ఆఫ్ఘన్లు ఎదురు చూస్తున్నారు. దాదాపు 5.5 లక్షల మంది ఆఫ్ఘన్లు ఆ దేశాన్ని వదిలి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి శరణార్థుల విభాగం తెలిపింది.

మరోవైపు నాటో దళాలకు మద్దతుగా పని చేసిన ఆప్ఘన్లపై తాలిబన్లు గురిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు ఆఫ్ఘన్ కుటుంబాలకు సాయం చేయాలని పాకిస్థాన్ ను అమెరికా కోరింది. అమెరికా విన్నపానికి పాక్ ప్రభుత్వం అంగీకరించింది. ఆప్ఘన్ నుంచి తరలి వచ్చే వారిలో 4 వేల మందికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించేందుకు పాకిస్థాన్ సన్నాహకాలు చేస్తోంది.  


More Telugu News