దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు
- 765 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 226 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- 5 శాతానికి పైగా పెరిగిన ఎయిర్ టెల్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు సరికొత్త రికార్డుల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతుండటం, యూరోపియన్ మార్కెట్లు కూడా లాభాల్లో ప్రారంభం కావడంతో మన ఇన్వెస్టర్లు పాజిటివ్ గా ట్రేడింగ్ చేశారు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 765 పాయింట్ల లాభంతో 56,890కి ఎగబాకింది. నిఫ్టీ 226 పాయింట్లు పెరిగి 16,931 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (5.19%), యాక్సిస్ బ్యాంక్ (4.00%), టాటా స్టీల్ (3.75%), టైటాన్ కంపెనీ (3.75%), మారుతి సుజుకి (3.03%).
టాప్ లూజర్స్:
నెస్లే ఇండియా (-1.10%), టెక్ మహీంద్రా (-1.01%), టీసీఎస్ (-0.43%).