తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు... వాతావరణ శాఖ హెచ్చరిక

  • ప్రస్తుతం కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
  • పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు
  • రాగల 5 రోజులకు వర్షసూచన
  • ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం!
గత కొన్నిరోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరో ఐదు రోజుల పాటు కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో రాగల 5 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో మహబూబాబాద్, యాదాద్రి, జయశంకర్ భూపాలపల్లి, సూర్యాపేట, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, భువనగిరి, వరంగల్, ములుగు, జనగామ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇవాళ, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని, రేపు ఆదివారం భారీ వర్షాలు పడతాయని వివరించింది.

అంతేకాదు, ఈ నెల 6న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, ఆ అల్పపీడనం వాయుగుండంగా మారొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.


More Telugu News