మెడికవర్ ఆసుపత్రికి వచ్చిన చిరంజీవి, పవన్ కల్యాణ్... సాయితేజ్ కోలుకుంటున్నాడని వైద్యుల వెల్లడి
- సాయితేజ్ కు రోడ్డుప్రమాదం
- తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిక
- మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స
- డాక్టర్లతో మాట్లాడిన చిరు, పవన్
హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెగా హీరో సాయితేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేనల్లుడు రోడ్డుప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారంతో చిరంజీవి, పవన్ కల్యాణ్ వెంటనే మాదాపూర్ మెడికవర్ ఆసుపత్రికి వచ్చారు. అల్లు అరవింద్ కూడా ఆసుపత్రికి తరలివచ్చారు. మెడికవర్ ఆసుపత్రి వైద్యులను అడిగి సాయితేజ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు స్పందించారు. సాయితేజ్ కోలుకుంటున్నాడని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.