సాయితేజ్ ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి: అపోలో వైద్యులు

  • రోడ్డుప్రమాదంలో సాయితేజ్ కు బలమైన గాయాలు
  • అపోలో ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స
  • తాజా బులెటిన్ విడుదల
  • సాయితేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
స్పోర్ట్స్ బైకు నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన హీరో సాయితేజ్ కు ప్రస్తుతం హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ సాయంత్రం 5 గంటల సమయంలో అపోలో ఆసుపత్రి వైద్యులు సాయితేజ్ ఆరోగ్యపరిస్థితిపై బులెటిన్ విడుదల చేశారు.

సాయితేజ్ కు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు. కీలక అవయవాలన్నీ బాగానే పనిచేస్తున్నాయని, అంతర్గత గాయాలేవీ లేవని ఆ బులెటిన్ లో స్పష్టం చేశారు. ప్రధాన అవయవాల్లో రక్తస్రావం లేదని, ప్రస్తుతానికి ఆరోగ్యం నిలకడగానే ఉందని వివరించారు. కాలర్ బోన్ గాయంపై రేపు పరిశీలన ఉంటుందని స్పష్టం చేశారు.


More Telugu News