భవన నిర్మాణ కార్మికుల నిధుల నుంచి కోట్లాది రూపాయల గోల్​ మాల్​: బొండా ఉమ

  • కేంద్రం విచారణ జరిపించాలి
  • 60 లక్షల మంది కార్మికులను ఏపీ సర్కార్ మోసం చేసింది
  • ఒక్కో కార్మికుడికి రూ.10 వేలివ్వాలి
60 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఏపీ ప్రభుత్వం మోసం చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమ విమర్శించారు. కార్మికుల సంక్షేమ నిధి నుంచి కోట్లాది రూపాయలను వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు. ఇవాళ ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. కార్మికులకు టీడీపీ అండగా నిలుస్తుందని చెప్పారు.

కార్మికుల నిధులను ప్రభుత్వం గోల్ మాల్ చేయడం దుర్మార్గమన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కంచె చేను మేస్తే కార్మికులకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News