డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాసిన టీడీపీ నేతలు

  • అయ్యన్న వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ నేతల ఆగ్రహం
  • చంద్రబాబు ఇంటి ముట్టడి
  • తనపై దాడి జరిగిందన్న జోగి రమేశ్
  • డీజీపీకి ఫిర్యాదు చేసిన వైనం
  • దీటుగా స్పందించిన టీడీపీ నేతలు
  • చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ
ఇవాళ చంద్రబాబు నివాసం వద్ద టీడీపీ, వైసీపీ నేతల హోరాహోరీ నెలకొన్న నేపథ్యంలో టీడీపీ నేతలు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. నేడు జరిగిన పరిణామాలపై దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, శ్రావణ్ కుమార్, ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. చంద్రబాబు ఇంటి వద్ద దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఇవాళ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడం తెలిసిందే. అయ్యన్న వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్, ఆ పార్టీ కార్యకర్తలు చంద్రబాబు నివాసాన్ని ముట్టడించగా, టీడీపీ నేతలు కూడా అదే స్థాయిలో స్పందించడంతో ఇరు వర్గాలు పరస్పరం కలబడ్డాయి. తనపై చంద్రబాబు గూండాలు దాడికి పాల్పడ్డారంటూ ఆపై జోగి రమేశ్ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కూడా డీజీపీకి లేఖ రాశారు.


More Telugu News