కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు... సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా పతనం

  • 524 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
  • 188 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • 9.53 శాతం పడిపోయిన టాటీ స్టీల్ షేర్ వాల్యూ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. ఈ ఉదయం నష్టాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు క్రమంగా కోలుకున్నాయి. అయితే మధ్యాహ్నం 11.30 తర్వాత నుంచి మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల లాభ, నష్టాల మధ్య కొనసాగింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 524 పాయింట్లు కోల్పోయి 58,490కి పడిపోయింది. నిఫ్టీ 188 పాయింట్లు నష్టపోయి 17,396 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హిందుస్థాన్ యూనిలీవర్ (2.96%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.10%), ఐటీసీ (1.08%), నెస్లే ఇండియా (0.70%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.23%).

టాప్ లూజర్స్:
టాటా స్టీల్ (-9.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.69%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.58%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (-2.83%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-2.81%).


More Telugu News