మోదీ అమెరికా పర్యటన రేపే.. బైడెన్‌తో భేటీ డేట్ ఫిక్స్
- ఈ నెల 24న వైట్‌హౌస్‌లో మోదీ, బైడెన్ భేటీ
- ద్వైపాక్షిక అంశాలతోపాటు ఆఫ్ఘన్ పరిస్థితులపైనా చర్చ
- క్వాడ్ కూటమి సదస్సులో పాల్గొననున్న మోదీ
భారత ప్రధాని నరేంద్రమోదీ రేపు (బుధవారం) అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అవుతారు. నేతలిద్దరూ ఈ నెల 24న వైట్‌హౌస్‌లో సమావేశం అవుతారని అధ్యక్ష భవనం నిన్న వెల్లడించింది. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా, అదే రోజు అమెరికాలో జరగనున్న క్వాడ్ కూటమి సదస్సులో మోదీ, బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు సుగా యోషిహిడే, స్కాట్ మోరిసన్ పాల్గొంటారు.