భారీ షాట్ కొట్టిన కోహ్లీ.. స్టేడియం అవ‌త‌ల ప‌డ్డ బంతి.. వీడియో ఇదిగో

  • షార్జా వేదికగా నిన్న‌ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌
  • ఐదో ఓవ‌ర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కోహ్లీ భారీ సిక్స్
  • 82 మీట‌ర్ల దూరం వెళ్లి ప‌డిన బంతి
షార్జా వేదికగా నిన్న‌ జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించిన విష‌యం తెలిసిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జ‌ట్టు నుంచి కోహ్లీ (53), పడిక్కల్ (70) మొద‌ట అద్భుతంగా రాణించిన‌ప్ప‌టికీ ఆ త‌ర్వాతి బ్యాట్స్‌మెన్ విఫ‌లం కావ‌డంతో ఆర్సీబీ ఓడింది.

నిన్నటి మ్యాచ్‌లో కోహ్లీ సిక్సు కొట్టినప్పుడు తీసిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. ఐదో ఓవ‌ర్‌లో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో కోహ్లీ ఓ భారీ సిక్స్ కొట్టాడు. దీంతో ఆ బంతి షార్జా స్టేడియం బ‌య‌ట‌ప‌డింది. అది 82 మీట‌ర్ల దూరం ప్ర‌యాణించింది.

ఆ స‌మ‌యంలో బ్యాట్ నుంచి భారీ సౌండ్ విన‌ప‌డింది. దీన్ని బ‌ట్టే ఆ బంతి ఎక్క‌డికి వెళ్తుందో తెలిసిపోతుంద‌ని కామెంటేట‌ర్ సైమ‌న్ డూల్ చెప్పారు. గవాస్క‌ర్ కూడా ఆ షాట్ పై కామెంట్రీ ఇస్తూ ఆ సౌండ్ వింటే బౌల‌ర్ల‌కు నిద్ర‌ప‌ట్ట‌ద‌ని అన్నారు.


More Telugu News