ఏపీలో గత 24 గంటల్లో 618 కరోనా కేసులు, 6 మరణాలు
- ఒక్కరోజులో 38,069 కరోనా పరీక్షలు
- చిత్తూరు జిల్లాలో 122 కొత్త కేసులు
- విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసు
- ఇంకా 12,482 మందికి చికిత్స
ఏపీలో గడచిన 24 గంటల్లో 38,069 కరోనా పరీక్షలు నిర్వహించగా, 618 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు (122), నెల్లూరు (100) జిల్లాలను మినహాయిస్తే మిగిలిన అన్ని జిల్లాల్లో వందకు లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 88, గుంటూరు జిల్లాలో 78, ప్రకాశం జిల్లాలో 76 కేసులు వెల్లడి కాగా... అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఒక పాజిటివ్ కేసును గుర్తించారు.
అదే సమయంలో 1,178 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 20,47,459 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,20,835 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 12,482 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 14,142కి పెరిగింది.