భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 410 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 106 పాయింట్లు కోల్పోయిన నిప్టీ
  • 4.52 పాయింట్లు పెరిగిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఐటీ, టెక్, రియాల్టీ, టెలికామ్, ఫైనాన్స్ తదితర సూచీలు అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో మార్కెట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఒకానొక సమయంలో 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. చివరికి ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 410 పాయింట్లు నష్టపోయి 59,667కి పడిపోయింది. నిఫ్టీ 106 పాయింట్లు కోల్పోయి 17,748కి దిగజారింది.
 
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (4.52%) ఎన్టీపీసీ (3.94%), సన్ ఫార్మా (3.55%), టైటాన్ కంపెనీ (1.79%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (1.62%).
 
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-3.68%), మహీంద్రా అండ్ మహీంద్రా (-3.41%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.73%), ఇన్ఫోసిస్ (-1.77%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.77%).


More Telugu News